మార్పు సరికాదు.. | - | Sakshi
Sakshi News home page

మార్పు సరికాదు..

Jun 20 2026 12:01 PM | Updated on Jun 20 2026 12:01 PM

సీఎం సొంత జిల్లాలో ఉన్న పీయూకు జాతీయ సెమినార్‌ నిర్వహించే అవకాశం వస్తే దాన్ని హైదరాబాద్‌కు మార్చడం శోచనీయం. యూనివర్సిటీలోనే సెమినార్‌ నిర్వహించాలి. సీఎం వస్తే యూనివర్సిటీలో సమస్యలను చూసి నిధులు ఇస్తారని అందరూ భావిస్తున్నారు. బీఆర్‌ఎస్వీ ఆందోళనలు, జాబ్‌ క్యాలెండర్‌ నిరసనలకు భయపడే జాతీయ సెమినార్‌ను కన్హా శాంతివనంకు మార్చారు. యూనివర్సిటీకి అధిక నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.

– భరత్‌బాబు, బీఆర్‌ఎస్వీ పీయూ అధ్యక్షుడు

యూనివర్సిటీకే రావాలి..

యూనివర్సిటీలో జాతీయ స్థాయి సెమినార్‌ నిర్వహిస్తున్నామని, దీనికి సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నారని అధికారులు మొదట తెలిపారు. దీంతో సీఎం సొంత జిల్లాలో ఉన్న యూనివర్సిటీకి వస్తే.. ఇక్కడ సమస్యలను పరిశీలించి నిధులు కేటాయిస్తారని అందరూ భావించారు. కానీ, సెమినార్‌ను హైదరాబాద్‌ శివారుకు మార్చడం బాధాకరం. సీఎం యూనివర్సిటీకే రావాలి.. ఇక్కడే సెమినార్‌ నిర్వహించాలి. అధిక నిధులు యూనివర్సిటీకి కేటాయించాలి.

– తాయప్ప, బీసీ సంఘం పీయూ అధ్యక్షుడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement