విస్తృతంగా వాహనాల తనిఖీలు
నారాయణపేట రూరల్: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆదివారం గూడ్స్ వాహనాల తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పట్టవా..? అనే శీర్షికతో ఆదివారం ‘సాక్షిశ్రీలో ఫొటో వార్త ప్రచురితమవగా.. పోలీసు శాఖ స్పందించింది. గూడ్స్ వాహనాల్లో సరుకు రవాణాను బదులు ప్రమాదకర పరిస్థితుల్లో జనాలను తీసుకు వెళ్లడం, ప్యాసింజర్ ఆటోల్లో సైతం పరిమితికి మించి కూలీలను ఎక్కించుకోవడం, బడిఈడు పిల్లలను పనులకు తీసుకుని వెళ్లడం వంటి వాటిపై దృష్టి సారించారు. ఈ క్రమంలో నారాయణపేట రూరల్ పోలీసులు ఎస్‌ఐ రాముడు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి 8 వాహనాలపై జరిమానా విధించారు. అదేవిధంగా పలువురు కూలీలు, డ్రైవర్లకు అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నియమాలు, ప్రమాదాలకు కారణాలు తెలియచేశారు. సురక్షిత ప్రయాణానికి ప్రతిఒక్కరు సహకరించాలని, పునరావృతం అయితే కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.
విస్తృతంగా వాహనాల తనిఖీలు


