కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి
దామరగిద్ద: వరి సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధరను అందించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ఆదేశాల మేరకు విండో అధ్యక్షుడు ఈదప్ప సమక్షంలో ఆదివారం మండలంలోని పిడెంపల్లి, మల్‌రెడ్డిపల్లి, కాన్‌కుర్తి గ్రామంలో ఐకేపీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యం సేకరించి సకాలంలో డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు బాల్‌రెడ్డి, ఈదప్ప, శ్రీనివాస్, ఖాజామియా, వెంకట్రామారెడ్డి, నీలిమాణిక్యప్ప, శ్రీనివాస్, టి రఘు, మహిళ సంఘం సభ్యులు పాల్గొన్నారు.


