నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
కోస్గి: మండలంలోని సర్జఖాన్‌పేట సబ్ స్టేషన్‌లో విద్యుత్ మరమ్మతు పనుల కారణంగా సోమవారం సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ వెంకటేష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తోగాపూర్, పోతిరెడ్డిపల్లి, సర్జఖాన్‌పేట, హకీంపేట గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గుర్తించి విద్యుత్ సిబ్బందికి సహకరించాలని కోరారు.
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
మద్దూరు: వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలను పాటించాలని ఎస్‌ఐ విజయ్‌కుమార్ ఆటో డ్రైవర్లకు సూచించారు. ఆదివారం పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై, వాహన పత్రాలు, హెల్మెట్ వినియోగం, మధ్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని సూచిస్తూ అవగాహన కల్పించారు. ప్రజల ప్రాణ భద్రత మనందరి బాధ్యతగా ఆటో డ్రైవర్లు ఎల్లపూడూ జాగ్రత్తంగా వాహనాలు నడపాలని అదేశించారు. చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలు దారితీస్తుందన్నారు. కార్యక్రమంలో పట్టణ ఆటో డ్రైవర్లు, పోలీసులు పాల్గొన్నారు.
ఘనంగా మాతా
మాణికేశ్వరి వార్షికోత్సవం
నారాయణపేట రూరల్: జిల్లా కేంద్ర సమీపంలోని పగడిమారి రోడ్డులోని సద్గురు రూపరహిత అహింసా యోగేశ్వరి వీరధర్మజ మాతా మాణికేశ్వరి ఏడో వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ధ్వజారోహణం, గోమాత పూజ, నాగ సింహాసన అభిషేకం, అమ్మవారి పాదుకల అభిషేక పూజలు, మహా గాయత్రి యజ్ఞము భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు మంగళహారతి, మహిళలచే ఓంకారం త్రిశూలాకార కార్తీక దీపాలంకరణోత్సవం, తీర్థ ప్రసాద, అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట్ల మధుసూదన్ రెడ్డి, మాధవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాత ఆశ్రమ కమిటీ సభ్యులు మందార, లత, శివరాంరెడ్డి, రాజేశ్వరి, వాల్వేకర్ నికేతన్, దశరథ్, విటల్ బిలాల్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


