
అక్రమ అరెస్టులనుఖండిస్తున్నాం
భూనిర్వాసితులు న్యాయమైన డిమాండ్‌తో ప్రభుత్వం తమకు పరిహారాన్ని పెంచాల ని కోరుతున్నారు. ప్ర భుత్వం ఓవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు భూసర్వేలు చేయడం సరికాదు. ఎకరాకు రూ.35 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇచ్చేంత వరకు భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతూనే ఉంటాం.
– వెంకట్రామరెడ్డి, భూ నిర్వాసితుల సంఘం గౌరవ అధ్యక్షుడు
14 ఎకరాలు కోల్పోతున్నాం..
మా తాతల నాటి నుంచి ఈ భూమినే నమ్ముకొని బతుకుతున్నాం. సర్వే నంబర్ 355లో మాకు 14 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో వ్యవసాయంతో పాటు ఆయిల్‌పాం, కాస్మోటిక్ ఆయిల్ మిషన్, గేదెల షెడ్డు ఉన్నాయి. మార్కెట్ విలువ ప్రకారం ఎకరాలకు రూ.35 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం స్పష్టమైన హామీతో పరిహారం ఇస్తేగానీ భూములను వదులుకోలేం.
– శ్రీనివాస్‌రెడ్డి, భూ నిర్వాసిత రైతు. కాన్‌కుర్తి
భూమి పోతే బతుకుకష్టమౌతుంది..
ఉన్న ఎకరన్నర భూమి ని కోల్పోతే.. బతకడం కష్టమవుతుంది. మాది నిరుపేద కుటుంబం, భూమిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇస్తే చాలనుకున్నాం. ప్రాణాలైనా వదులకుంటాం.. కానీ భూమి వదలం.
– భీమప్ప, భూ నిర్వాసిత రైతు, కాన్‌కుర్తి
●

అక్రమ అరెస్టులనుఖండిస్తున్నాం

అక్రమ అరెస్టులనుఖండిస్తున్నాం