
గ్రామీణ ఓటర్లు 3,96,541మంది
నారాయణపేట: స్థానిక సంస్థల ఎన్నికలకు మరో ముందడుగు పడింది. ఎన్నికల నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా మంగళవారం తుది ఓటరు జాబితాను విడుదల చేసింది. జిల్లాలోని 272 గ్రామపంచాయతీల్లో 2,466 వార్డులకు గాను 2,470 పోలింగ్ కేంద్రాల పరిధిలో 3,96,541 మంది ఓటర్లు ఉన్నట్లు డీపీఓ సుధాకర్‌రెడ్డి వెల్లడించారు. వీరిలో పురుషులు 1,94,124 మంది, మహిళలు 2,02410 మంది, ఇతరులు ఏడుగురు ఉన్నారు. ఓటరు జాబితాను అన్ని గ్రామపంచాయతీలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రదర్శించారు.