
పల్లెగడ్డ ప్రజలు అధైర్యపడొద్దు
మరికల్: మండలంలోని పల్లెగడ్డ ప్రజలకు అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పల్లెగడ్డ గ్రామాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. గ్రామ ప్రజలు దేవాదాయ శాఖ భూమిలో ఇండ్లు నిర్మించుకున్నారని వాటిని వెంటనే తొలగించాలంటూ దేవాదాయశాఖ వారు కోర్టు నుంచి ఉత్తర్వులు పంపించడాన్ని ఖండించారు. వంద ఏళ్ల క్రితమే వారు ఇక్కడ ఇండ్లు నిర్మించుకున్నారని ప్రభుత్వానికి విద్యుత్ బిల్లులు, పంచాయతీకి పన్నులు కడుతున్న వారికి ఎలా నోటీసులు జారీ చేస్తారని ప్రశ్నించారు. కోర్టు నుంచి నోటీసులు వస్తే సొంతంగా లాయర్‌ను ఏర్పాటు చేసి పల్లెగడ్డ గ్రామస్తులకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తానన్నారు. గ్రామంలో ఇళ్లతోపాటు పాఠశాల గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా నిర్మించారని, ప్రభుత్వ ఆస్తులను కూడా కూల్చివేస్తారా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సురేఖరెడ్డి, నాయకులు తిరుపతయ్య, రాజవర్దన్‌రెడ్డి, సంపత్‌కుమార్, కృష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.