
కొత్త పోలింగ్‌స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు
కోస్గి రూరల్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 1,200 జనాభా కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నూతన పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని జెడ్పీ సీఈఓ శైలేశ్వర్ అన్నారు. ఈ మేరకు ఎన్నికల బాక్స్‌లను భద్రపరచేందుకు పాలిటెక్నిక్ కళాశాలలో స్ట్రాంగ్ రూంలను బుధవారం పరిశీలినట్లు ఆయన తెలిపారు. కోస్గి మండలంలో కొత్తగా 7 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని, ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతకుముందు మండల తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్‌ను చేపట్టారు. 18 ఏళ్లు నిండిన యువతను ఓటరుగా నమోదు చేయాలని, మార్పులు, చేర్పులను చేపట్టే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు మరణించిన వారి పేర్లను జాబితాలో నుంచి తొలగించాలని ఆదేశించారు. ఓటరు జాబితాను సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు అందించామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీధర్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, సూపరింటెండెంట్ తిరుపతయ్య తదితరులు ఉన్నారు.