
భవిత కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి
నారాయణపేట: భవిత కేంద్రాల్లో చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయ ఆవరణలో ఉన్న భవిత కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంఖ్య, విద్యా బోధన నిర్వహణ తదితర వివరాలను తెలుసుకున్నారు. అనంతరం విద్యాబోధన పరికరాలతో పాటు పలు రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. పిల్లలకు రవాణా ఛార్జీల చెల్లింపులపై ఆరా తీశారు. కేంద్రంలో వాష్ బేసిన్, మరుగుదొడ్లు లేకపోవండపై అసహనం వ్యక్తం చేశారు. పక్కనే మరుగుదొడ్లు ఉన్నాయని.. వాటికి నీటి వసతి లేకపోవడంతో నిరుపయోగంగా మారాయని ఎంఈఓ బాలాజీ కలెక్టర్‌కు తెలియజేశారు. స్పందించిన కలెక్టర్.. ఒక్కరోజులో మరుగుదొడ్లకు నీటి వసతి కల్పించి వినియోగంలోకి తీసుకురావాలని మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓను ఆదేశించారు. అనంతరం ఎమ్మార్సీ భవనాన్ని పరిశీలించారు.
చదువుతో పాటు కరాటే నేర్పించాలి
మరికల్: కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థినులకు చదువుతో పాటు కరాటే వంటి యుద్ధవిద్య నేర్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మరికల్ మండలం పస్పులలోని కేజీబీవీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎస్‌ఓ రాజ్యలక్ష్మికి సూచించారు. అడిగి తెలుసుకున్నారు. ఏమైన వసతులు అవసరముంటే తన దృష్టికి తీసుకరావాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఈఓ గోవిందరాజులు, తహసీల్దార్ రాంకోటి, ఎంపీడీఓ కొండన్న ఉన్నారు.