కొడంగల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
మద్దూరు/కొత్తపల్లి: తెరాష్ట్రంలోనే కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చుదిద్దాదామని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి అన్నారు. కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారటీ( కడా) అధికారి వెంకట్‌రెడ్డితో కలిసి ఉమ్మడి మద్దూరు మండలంలోని పంచాయతీరాజ్, అర్‌అండ్‌బీ నిధులతో పలు బీటీ రోడ్లకు శంకుస్థాపనలు, అంగన్‌వాడీ, గ్రామపంచాయతీ, పాఠశాల భవనాలను గురువారం అయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పనులను నాణ్యత ప్రామాణాలతో చేపట్టాలని అధికారులు ఆదేశించారు. కొత్తపల్లి మండలంలోని దుప్పట్‌గట్ నుంచి అల్లీపూర్ టూ గొకుల్‌నగర్ వరకు 5 కిలో మీటర్ల బీటీ రోడ్డు 8.93 కోట్లు, మద్దూరు మండలంలోని చెన్వార్ నుంచి నారాయణపేట మండలంలోని బండగొండ వరకు 2 కిలో మీటర్లు బీటీ రోడ్డు రూ.2.85 కోట్లు, మోమినాపూర్ వాగుపై వంతెన రూ. 7.20 కోట్లు, మోమినాపూర్ నుంచి బొమ్మన్‌పాడ్ 6.5 కిలోమీటర్ల బీటీ రోడ్డు రూ. 12.35 కోట్లు, పెదిరిపాడ్ ఉన్నత పాఠశాల ప్రహారి నిర్మాణం కోసం రూ.43 లక్షలు, శంకుస్థాపనలు చేశారు. పెదిరిపాడ్‌లో రూ.20 లక్షతో చేపట్టినా గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అలాగే మద్దూరులో రూ.20 లక్షలతో చేపట్టినా మాడల్ అంగన్‌వాడీ భవనాన్ని, అర్‌అండ్‌బీ శాఖ రూ.63.71 లక్షలతో నిర్మాణం చేపట్టినా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ విజయ్‌కమార్, కోస్గి ఎఎంసీ చైర్మన్ ముద్ది భీములు, పీఏసీఎస్ చైర్మన్ నర్సింహా, మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు సంజీవ్, రమేష్‌రెడ్డి, రహీం, హన్మిరెడ్డి, వీరారెడ్డి, షేక్‌మీరాన్, వెంకట్‌రెడ్డి, పీఆర్, అర్‌అండ్‌బీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


