సమావేశంలో మాట్లాడుతున్న డీఈఓ లియాకత్ అలీ
నారాయణపేట రూరల్: ప్రతి విద్యార్థి క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని డీఈఓ లియాకత్ అలీ సూచించారు. పట్టణంలోని దయానంద్ విద్యామందిర్ ఎయిడెడ్ స్కూల్‌లో గురువారం టెన్త్ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల పట్ల ఒత్తిడిని అధిగమించాలని, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలన్నారు. కాపీ రైటింగ్‌పై నమ్మకం పెట్టుకుంటే నష్టపోతారని, భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకోలేరని అన్నారు. లక్ష్యం లేని చదువు వ్యర్థమని, తల్లిదండ్రులను గౌరవించాలని, ఉన్నత స్థాయికి చేరినా తొలిమెట్టును మరువరాదన్నారు. నాయకత్వ లక్షణాలను వివరించారు. అంతకుముందు యజ్ఞం నిర్వహించారు. అనంతరం చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ వేణుగోపాల్, ఆర్టీఓ వీరస్వామి, ఎస్‌ఐ సురేష్, హెచ్‌ఎం కే.నారాయణ, కమిటీ సభ్యులు నాగమ్మ, విజయ్, సుఖ్‌దేవ్, ప్రభాకర్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.


