ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలంలో శ్రీ అహోబిల మఠం స్థాపకులు, ప్రథమ పీఠాధిపతి శ్రీమాన్ ఆదివణ్ శఠగోప స్వామి తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు శుక్రవారం వేకువజామునే స్వామి, అమ్మవార్లను సుప్రభాత సేవ తో మేల్కొలిపి దివ్యదర్శనం అనంతరం నిత్యపూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తి శ్రీమాన్ ఆదివణ్ శఠగోప స్వామి ఉత్సవ విగ్రహం కొలువుంచి అర్చన, అభిషే కం నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన ఉత్సవ పల్లకీలో కొలువుంచి గ్రామోత్సవం నిర్వహించారు.
పోతిరెడ్డిపాడు నుంచి తగ్గిన నీటి విడుదల
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ 2, 4 ,5, 7 గేట్లు తెరచి ఉంచినప్పటికీ కేవలం 750 క్యూసెక్కుల నీళ్లు మాత్రమే ఎస్సారెమ్సీ కాల్వలోకి వెళ్తున్నాయి. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి కేసీఎస్కేప్ కాల్వకు సరఫరా చేస్తున్నారు. సెప్టెంబర్ 21వ తేదీ నాటికీ శ్రీశైలం డ్యాంలో 858 అడుగుల నీటిమట్టం ఉండగా ప్రస్తుతం 846.90 అడుగుల నీటి మట్టానికి చేరుకోగా.. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్ద 845.90 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 35 టీఎంసీల నీటిని మాత్రమే ఎస్సార్బీసీ, తెలుగుగంగ, కేసీ ఎస్కేప్ కాల్వలకు సరఫరా చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
జెడ్పీలో ఎన్నికల సెల్
ఏర్పాటుకు చర్యలు
కర్నూలు(అర్బన్): జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఎన్నికల విభాగాన్ని ఏర్పా టు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు జెడ్పీ సీఈఓ ఆర్.సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయన శుక్రవారం ఎన్నికల సెల్ ఏర్పాటుకు జెడ్పీ చైర్మన్ చాంబర్ ఎదుటనున్న గదిలో కంప్యూటర్లు, ఫర్నిచర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు కార్యాలయ పర్యవేక్షకులు సీ.మురళీమోహన్‌రెడ్డి, రాంగోపాల్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రి య పూర్తయ్యేంత వరకు సాంకేతికతపై పట్టున్న వివిధ సచివాలయాల్లో పనిచేస్తున్న ముగ్గురు డిజిటల్ అసిస్టెంట్లను కూడా వినియోగించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.


