విద్యుత్‌ పొదుపునకు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ పొదుపునకు సహకరించాలి

Oct 10 2026 1:10 AM | Updated on Oct 10 2026 1:10 AM

నంద్యాల(అర్బన్‌): అనవసర విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించి విద్యుత్‌ పొదుపునకు అందరూ సహకరించాలని ఏపీఎస్పీడీసీఎల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ రమణ అన్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించిపోతున్నాయని, ఈ నేపథ్యంలో ప్రజలు విద్యుత్‌ను అవసరమైన మేరకే వినియోగించుకోవాలని సూచించారు. స్థానిక ఎస్‌ఈ కార్యాలయంలో జిల్లా విద్యుత్‌ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్‌ సమస్యల పరిష్కారం కోసం డిస్కం సీఎండీ ఆధ్వర్యంలో డయల్‌ యువర్‌ సీఎండీ, కరెంటోళ్ల జనబాట వంటి వినూత్న కార్యక్రమాలు ప్రతి వారం నిర్వహించి వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. ప్రజల సౌకర్యార్థం విద్యుత్‌ బిల్లులను సులభంగా చెల్లించే విధంగా ఫోన్‌పే, తదితర డిజిటల్‌ చెల్లింపు వేదికలను అందుబాటులోకి తెచ్చామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ శ్రీనివాసులురెడ్డి, ఈఈ, డీఈఈ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement