పూర్తి మట్టం : 1,633 అడుగులు
ప్రస్తుతం : 1,620.270
టీఎంసీల సామర్థ్యం : 105.788
ప్రస్తుతం : 62.091
ఇన్‌ఫ్లో (క్యూసెక్కులు) : 0
ఔట్‌ఫ్లో (క్యూసెక్కులు) : 9,800
శ్రీశైల దేవస్థానంలో శ్రీభ్రమరాంబాదేవి ఆలయ ముఖ్య అర్చకుడిగా పనిచేస్తున్న ఈయన పేరు తాండ్ర పవన్‌కుమార్‌శర్మ. ఎంబీఏ చదివి మంచి ఉద్యోగాలు వచ్చినా వెళ్లలేదు. స్వస్థలం బండిఆత్మకూరు కాగా.. తండ్రి తాండ్ర బాలసుబ్రహ్మణ్యశర్మ చూపిన బాటలో నడిచారు. ప్రవేశ, వర, ప్రవర విద్యలో ప్రావీణ్యం సాధించారు. దేవదాయశాఖ అర్చకుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడంతో 2016లో ఉత్తీర్ణత సాధించారు. అప్పటి నుంచి శ్రీభ్రమరాంబాదేవి ఆలయంలో అర్చకునిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. రెండేళ్ల క్రితం పదోన్నతిపొంది ప్రస్తుతం ముఖ్య అర్చకునిగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు అనేక మంది భక్తులకు శఠారీని తలపై పెట్టి శతమానం భవతే అంటూ ఆశీర్వచనాలు అందిస్తున్నాను’ అని చెప్పారు. స్వామిఅమ్మవార్ల దయతో వారి చెంతనే ఉండి సేవ చేసుకునే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.


