ఇప్పటికే పత్తికొండ, ఎమ్మిగనూరు డీఎస్పీల బదిలీ
పలువురు సీఐలను బదిలీ చేసిన ప్రభుత్వం
మరికొందరు ఎస్‌ఐలపైనా వేటు
నంద్యాల జిల్లా కేంద్రంలో ముగ్గురు సీఐలకు స్థానచలనం
అనుకూలంగా పనిచేసేవారికి మంత్రి పోస్టింగులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సిద్ధ్దమైన బదిలీల జాబితా
టీడీపీ నేతల కనుసన్నల్లో జాబితాల తయారీ
ఒకటి రెండు రోజుల్లో వెలువడనున్న బదిలీల జాబితా?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పచ్చపార్టీ పావులు కదుపుతోంది. ఇందుకోసం అన్నిరకాల అక్రమాలకు తెరతీసింది. ప్రధానంగా ఎన్నికల్లో పోలీసులను అడ్డుపెట్టి లబ్ధి పొందే ప్రయత్నాలకు దిగింది. ఇందులో భాగంగా పోలీస్ అధికారుల బదిలీలు మొదలు పెట్టింది. ఎన్నికల్లో పచ్చపార్టీకి అనుకూలంగా పనిచేసే వారికి పోస్టింగులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే కొంతమంది డీఎస్పీలు, సీఐలను బదిలీ చేసిన ప్రభుత్వం.. మిగిలిన వారిని ఒకటి, రెండు రోజుల్లోనే బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది. పచ్చనేతలు ఇచ్చిన పోలీసు అధికారుల జాబితాతో అధిష్టానం బదిలీలు మొదలు పెట్టిందనే చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పత్తికొండ, ఎమ్మిగనూరు డీఎస్పీలను బదిలీ చేసిన ఉన్నతాధికారులు. పత్తికొండకు సంబంధించి ఇద్దరు సీఐలను బదిలీ చేశారు. వారి స్థానంలో పచ్చనేతలు చెప్పిన వారికి పోస్టింగులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కోడుమూరులో ఎస్‌ఐని బదిలీ చేయనున్నట్లు సమాచారం. మంత్రాలయంలో టీడీపీ ఇన్‌ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి ఆదేశాలతో అక్కడున్న సీఐ దస్తగిరి బాబు, ఎస్‌ఐ మల్లికార్జునను బదిలీ చేస్తున్నట్లు సమాచారం. వీరి స్థానాల్లో టీడీపీ ఇన్‌చార్జి ఇచ్చిన అధికారులను నియమించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఎమ్మిగనూరు, ఆదోని, కర్నూలు, మిగిలిన నియోజకవర్గాల్లోనూ పోలీసు అధికారులను బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. అటు నంద్యాల జిల్లాలోనూ స్థానిక ఎన్నికల కోసం ప్రభుత్వం పోలీసు అధికారులను బదిలీ చేస్తున్నట్లు ప్రచారం ఉంది. ఇప్పటికే జిల్లా కేంద్రంలో మంత్రి ఫరూక్ ఆదేశాల మేరకు వన్‌టౌన్, టూటౌన్ సీఐలను బదిలీ చేసిన అధికారులు, వారి స్థానంలో మంత్రి సూచించిన పోలీసు అధికారులను నియమించినట్లు తెలుస్తోంది. వీరే కాకుండా నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ పోలీసు అధికారులను బదిలీ చేస్తున్నట్లు సమాచారం.
పచ్చ అధికారుల పేర్లివ్వండి
పచ్చ పార్టీకి అనుకూలంగా పనిచేసే అధికారుల పేర్లు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వ పెద్దల నుంచి పచ్చ నేతలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. వారి ఆదేశాలను అందుకున్న ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే పోలీసు అధికారుల జాబితాలు ఇప్పటికే అధిష్టానానికి అందించినట్లు సమాచారం. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే పరిస్థితి ఉండటంతో అంతలోపే పోలీసు అధికారుల బదిలీలు పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ పెద్దల నుంచి స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వానికి సహకరించాలంటూ పోలీసు ఉన్నతాధికారులకు సూచనలు అందినట్లు సమాచారం. పోలీసులను అడ్డుపెట్టి స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఫలితాలు వచ్చేలా కృషి చేస్తానని ఇప్పటికే ఈ ప్రాంతంలో పనిచేస్తున్న పోలీసు ఉన్నతాధికారి ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
వెనక్కి తగ్గేది లేదు..
అయితే స్థానిక ఎన్నికల్లో ప్రజాబలంతో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షాన్ని ఢీకొట్టేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ పలుమార్లు ప్ర త్యేక సమావేశాలు నిర్వహించి పార్టీశ్రేణులను సమాయత్తం చేసింది. ఎన్నికలు ఏ నిముషంలో వచ్చినా పోటీకి సై అంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఉరకలేస్తున్నా యి.ప్రభుత్వం ఎన్నిఅడ్డంకులు సృష్టించినా, ఎన్నిరకాల ఒత్తిళ్లు తీసుకొచ్చినా స్థా నిక ఎన్నికల్లో పోటీకి వెనుకాడేది లేదని,ప్రజాబలంతో విజయమే లక్ష్యంగా పనిచేస్తామని వైఎ స్సార్ కాంగ్రెస్‌పార్టీనేతలు పేర్కొంటున్నారు.
స్థానిక ఎన్నికలకు పోలీస్ అధికారుల బదిలీలు


