బేతంచెర్ల: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలన్నారు. గ్రామ, మండల స్థాయి వరకు ఎవరికై నా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే తన దృష్టికి తీసుకు రావాలన్నారు. అలాగే ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు, కార్యకర్త లు సమస్యలను మాజీ మంత్రి బుగ్గన దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ చలం రెడ్డి, మాజీ ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, నాయకులు బుగ్గన చంద్రారెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, మురళీకృష్ణ, రామచంద్రుడు, లక్ష్మిరెడ్డి, తిరుమలేశ్వర్ రెడ్డి, పిట్టల జాకీర్, మాజీ సర్పంచ్‌లు వేణుగోపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


