నందికొట్కూరు: పేదలకు వైద్య సేవలు అందించాల్సిన దామగట్ల విలేజ్ హెల్త్ క్లినిక్ శుక్రవారం మధ్యాహ్నానికే మూత పడింది. వైద్యం కోసం వచ్చిన వారు నిరాశతో వెనుదిరిగారు. పేద రోగులకు చెంతనే వైద్యం అందించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హెల్త్‌క్లినిక్‌లో సేవలు నిర్వీర్యమవుతున్నాయి. రెండు రోజుల క్రితం దామగట్ల విలేజ్ హెల్త్ క్లినిక్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరగడంతో ఓ వ్యక్తి ఫొటోలు తీయడంతో పంచాయితీ చివరకు బ్రాహ్మణకొట్కూరు పోలీసు స్టేషన్ వరకు చేరినట్లు సమాచారం. అయితే గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు సర్దిచెప్పినట్లు తెలుస్తోంది. జిల్లా, మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.


