● నంద్యాలలో గణనాథుడి
నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు
● చిన్న చెరువు కట్ట వద్ద ఆరు క్రేన్లు
నంద్యాల(వ్యవసాయం): జిల్లా కేంద్రమైన నంద్యాలలో గణేశ్ నిమజ్జనాన్ని శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాటే వరకు నిర్వహించనున్నారు. పట్టణ సమీపంలోని చిన్న చెరువు కట్టపై నూతనంగా తాత్కాలిక రోడ్డును నిర్మించారు. ఫ్లడ్‌లైట్లను, బారీగేట్లను ఏర్పాట్లు చేశారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆటోలు, ట్రాక్టర్లలో తీసుకొచ్చిన విగ్రహాలను చిన్న చెరువులో నిమజ్జనం చేయడానికి ఐదు ర్యాంప్‌లను, ఐదు క్రేన్‌లను సిద్ధంగా ఉంచారు. ఏర్పాట్లను ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక, ఆర్‌డీఓ విశ్వనాథ్, తహసీల్దార్లు శ్రీవాణి, శ్రీనివాసులు పరిశీలించారు.


