స్పెషల్‌ టెట్‌తో ప్రయోజనం లేదు | - | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ టెట్‌తో ప్రయోజనం లేదు

Aug 26 2026 1:30 AM | Updated on Aug 26 2026 1:30 AM

నంద్యాల(న్యూటౌన్‌): ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయులకు స్పెషల్‌ టెట్‌తో ప్రత్యేక ప్రయోజనం లేదని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు భాస్కరరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్‌బాషా, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రామపక్కీర్‌రెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ శిక్షణా అర్హతలు, నియామక పక్రియ ద్వారా అర్హత సాధించి నిరంతర బోధన సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను కొత్త నియామకానికి పోటీ పడే అభ్యర్థులతో సమానంగా టెట్‌ అర్హత ప్రమాణాలతో పరీక్షించే విషయం పునః పరిశీలించాలన్నారు. టెట్‌లో జనరల్‌ కేటగిరికి 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కేటగిరిలకు 40 శాతం అర్హత మార్కులు ఉంటాయన్నారు.

40 శాతానికి పరిమితం చేయాలి...

ప్రత్యేక టెట్‌ను ఆఫ్‌లైన్‌లో నిర్వహించి ఉత్తీర్ణత మార్కులను 40 శాతానికి పరిమితం చేయాలని ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌ అన్నారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సీనియర్‌ ఉపాధ్యాయుల అనుభవాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. వయస్సు, దీర్ఘకాలిక సేవ, పాఠశాలలో ఉన్న బోధన, బాధ్యతలను పరిగణలోకి తీసుకోకుండా సీబీటీ పరీక్ష విధానాన్ని అమలు చేయడం వల్ల ఉపాధ్యాయులపై అదనపు ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు. సమావేశంలో ఎస్‌టీయూ నాయకులు వెంకటరామిరెడ్డి, గోపాలకృష్ణ, నాగేంద్రకుమార్‌, ఎల్లా సుబ్బయ్య, కృష్ణారెడ్డి, ప్రభాకర్‌, నరసింహరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement