నంద్యాల(వ్యవసాయం): కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని రాయలసీమ జేఏసీ నాయకులు ప్రతాపరెడ్డి, జీవీఎన్ ప్రసాద్, పెద్ది శ్రీనివాసులు అన్నారు. మంగళవారం న్యాయవాదులు కోర్టు ఆవరణం నుంచి ర్యాలీగా వెళ్లి టెక్కె రోడ్డుపై మానవహారంగా నిలిచి శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. 90 రోజుల్లో బెంచ్ ఏర్పాటు చేస్తామన్న మంత్రి నారా లోకేష్ హామీ ఏమైందని ప్రశ్నించారు. సర్క్యూట్ బెంచ్ ప్రచారంపై న్యాయవాదులు మండిపడ్డారు. హామీలు అమలు చేయకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రాయలసీమకు న్యాయ సేవలను త్వరగా అందించాలంటూ, కర్నూలులో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందన్నారు. కార్యక్రమంలో న్యా యవాదులు వివేకానందరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మద్దిలేటి, షేక్ రియాజ్, శ్రీదేవి, కృపావతి, సుబ్బరాయుడు, ఆలంఖాద్రి, సుదాంశమౌళిరెడ్డి, రాజేంద్రప్రసాద్, ఓబులరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


