అభివృద్ధి పనులను ప్రారంభించే తీరిక లేని కోట్ల | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులను ప్రారంభించే తీరిక లేని కోట్ల

Aug 25 2026 2:03 AM | Updated on Aug 25 2026 2:03 AM

బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

డోన్‌: రూ.3కోట్ల వ్యయంతో గత ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా పట్టణ నడిబొడ్డున అత్యాధునిక వసతులతో నిర్మించిన నూత న ఎంపీడీఓ కార్యాలయ భవనాన్ని రెండేళ్లు గడిచినా ప్రారంభించకపోవడంలో ఆంతర్యం ఏమిటని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి డోన్‌ టీడీపీ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్‌రెడ్డిని నిలదీశారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడు తూ ఆదివారం ఎంిపీడీఓ కార్యాలయాన్ని క్యాబినెట్‌ హోదా కలిగిన జెడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి ప్రభుత్వ ప్రొటోకాల్‌ ప్రకారం ప్రారంభిస్తే ఆయనతో పాటు డోన్‌ ఎంపీపీ రేటి రాజశేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ బద్దల రాజ్‌కుమార్‌, వైస్‌ ఎంపీపీ ఎర్రిస్వామి, పార్టీ వలంటీర్‌ విభాగం జిల్లా అధక్షులు పోస్టు ప్రసాద్‌ తది తరులపై అక్రమ కేసులు బనాయించి వేధించడం టీడీపీ దుర్మార్గపు రాజకీయానికి నిదర్శనమన్నారు. 2020–23 మే నెల 26న రూ.1.5 కోట్లతో ఎంపీడీఓ భవనాన్ని నిర్మించేందుకు ఆర్థిక మంత్రిగా తాను భూమి పూజ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలోనే తలమానికంగా భవనాన్ని తీర్చిదిద్దేందుకు జెడ్పీ చైర్మన్‌ అదనంగా మరో రూ.1.5 కోట్లు జిల్లా పరిషత్‌ నిధుల నుంచి మంజూరు చేసి భవన నిర్మాణాన్ని పూర్తి చేశారన్నారు. రెండేళ్ల నుంచి అభివృద్ధి పనులు జరుగకుండా అడ్డుకోవడ మే కాకుండా నిర్మించిన అనేక భవనాలను రాజకీయ దురుద్ధేశంతో ప్రారంభించకుండా శిథిలావస్థ కు చేరుకునేలా ప్రవర్తిస్తుండాన్ని నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారన్నారు.

ఎమ్మెల్యేకి తీరిక లేదా

నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన విలేజ్‌ క్లీనిక్‌, రైతు భరోసా, గ్రామ సచివాలయ, అంగన్‌వాడీ, పాఠశాలల అదనపు గదులు, క్లబ్‌ హౌస్‌, రిజిస్టర్‌ కార్యాలయ భవనాలు రూపుదిద్దుకున్నాయన్నారు. వీటితో పాటు వెంకటాపురం తుమ్మల చెరువు, వెంగలాంపల్లె చెరువులో టూరిజం స్పాట్‌లను ప్రారంభించే తీరిక కూడా డోన్‌ ప్రజా ప్రతినిధికి లేక పోవడం దురదృష్టకరమన్నారు. డోన్‌ ఎంపీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించా లని పంచాయతీరాజ్‌ అధికారులు, ఎంపీడీఓలతో కలిసి ఎంపీపీ రేగటి రాజశేఖర్‌రెడ్డి అనేక సార్లు స్వయ ంగా కలిసి కోరినా ఎమ్మెల్యే కోట్ల వాయిదాలు వేస్తూ అవమానించారన్నారు. జెడ్పీ చైర్మన్‌, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం అయిపోయిన తరువా త భవనాన్ని ప్రారంభించాలనుకోవడం చూస్తే ప్రజా ప్రతినిధులకు ఏ మాత్రం గౌరవం ఇస్తున్నారో ఇట్టే తెలిసిపోతుందన్నారు. అభివృద్ధి ఫలాలను ప్రజలకు సకాలంలో సత్వరంగా అందేటట్లు ఎమ్మెల్యే కోట్ల కృషి చేయాలని మాజీ మంత్రి బుగ్గన హితవు పలికారు.

జెడ్పీ చైర్మన్‌తో సహ 14 మంది వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసు

యాక్ట్‌ 30 అమలులో ఉన్న సమయంలో డోన్‌లో ఎంపీడీఓ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించడం చట్టరీత్యా నేరమని, ఈ మేరకు జెడ్పీ చైర్మన్‌తో సహ 14 మంది వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రోటోకాల్‌కు విరుద్ధంగా ఎంపీడీఓ కార్యాలయ భవనాన్ని ప్రారంభించడం నేరంగా పరిగణిస్తున్నామన్నా రు. శాంతి భద్రతలకు భంగం కలిగించే రీతిలో కుట్ర పూరితంగా వ్యవహరించిన జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎర్రపోతుల పాపిరెడ్డి, ఎంపీపీ రేగటి రాజశేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ బద్దల రాజ్‌కుమార్‌, వైస్సార్‌సీపీ సీనియర్‌ నేతలు పోస్టు ప్రసాద్‌, సోమేష్‌యాదవ్‌, మల్లెంపల్లె రామచంద్రుడు, మల్లికార్జునరెడ్డి, మల్యాల శ్రీనివాసరెడ్డి, ఓబులాపురం సుధాకర్‌యాదవ్‌, తాడూరు ఎర్రిస్వామి, రామేశ్వరరెడ్డి, పూజారి వంశీకృష్ణ, జాకీర్‌ హుస్సేన్‌, లక్ష్ముంపల్లె ఓబులేసు, సయ్యద్‌ మన్సూర్‌తో పాటు మరి కొందరిపై కేసు నమోదు చేశామన్నారు. కాగా పోలీసులు వీరిని మెజిస్ట్ట్ట్రేట్‌ ఎదుట హాజరు పరిచి రిమాండ్‌ కోరగా పోలీసుల వాదనను తోసిపుచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement