మిన్నంటిన నినాదాలు.. | - | Sakshi
Sakshi News home page

మిన్నంటిన నినాదాలు..

Aug 25 2026 2:03 AM | Updated on Aug 25 2026 2:03 AM

పోలీసులు, ప్రభుత్వ తీరుపై వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. సొంత రాష్ట్రంలో రోడ్లపై తిరగాడేందుకు, శాంతియుతంగా ప్రాజెక్టులను చూసేందుకు కూడా స్వేచ్ఛ లేకుండా సీఎం చంద్రబాబునాయు డు పోలీసులతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని మండిపడ్డారు. ‘మేము ఏమైనా నక్సల్స్‌మా.. టెర్రరిస్టులమా.. ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా అటకాయించటం సమంజసం కాదు’ అంటూ డీఎస్పీతో వాగ్వాదానికి దిగారు. రైతులపై పోలీసు జులం నశించాలంటూ నినాదాలు చేశారు. రైతులకు సాగునీరివ్వని చంద్రబాబునాయుడు డౌన్‌ డౌన్‌.. రైతులకు సాగునీరివ్వకపోవటం సిగ్గు..సిగ్గు.. సాగునీరిచ్చేవరకు పోరాడతాం.. రైతుల ఐక్యత వర్దిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. చివరికి బారికేడ్లు తీసుకొని నడుచుకుంటూ పోతులపాడు వైపు వెళ్లేందుకు నాయకులు యత్నించగా పోలీసులు నిలువరించారు. ‘పోలీసు వ్యవస్థ దిగజారి పనిచేయడం మొట్టమొదటిసారిగా చూస్తున్నాం, పోలీసులే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్లుగా ఉంది.. అన్ని రోజులు ఒకేలా ఉండవని పోలీసులు గుర్తుంచుకోవాలి’ అంటూ శైలజానాథ్‌, కాటసాని, శిల్పా హెచ్చరించారు. విలేకరుల సమావేశం అనంతరం వారు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ వద్దకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. అనుమతితో రావాలని నేతలకు డీఎప్పీ సర్దిచెప్పడంతో మధ్యాహ్నం 1.10 గంటలకు వెనుదిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement