రాయలసీమ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి తాకట్టు పెట్టారు. శ్రీశైలం ప్రాజెక్టు, పోతిరెడ్డిపాడు ను తెలంగాణకు అమ్మేశారు. చీకటి ఒప్పందం కారణంగానే సీమను ఏడారిగా మార్చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ప్రభుత్వం రోజుకు నాలుగు టీఎంసీలు తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తున్నా చంద్రబాబు ఎందుకు నోరు మెదపరు. రాయలసీమ కరువుతో అల్లాడిపోతుంటే పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని తరలించి ప్రాజెక్టులను నింపే అవకాశం ఉన్నా ఎందుకు చోద్యం చూస్తున్నారు. శ్రీశైలం నిండా నీళ్లున్నా ప్రాజెక్ట్‌లను నింపకపోవడం వెనుక కుట్ర దాగి ఉంది. రాయలసీమ ప్రజలంటే చంద్రబాబుకు చులకన. నికర జాలాలతో సీమ ప్రాజెక్టులను నింపండి. తుంగభద్రలో రావాల్సిన వాటా కాలువలకు విడుదల చేయాలి. వరి, వేరు శనగకాయలు వేసుకోవద్దు అని సీఎం చంద్రబాబు చెప్పడం హాస్యాస్పందంగా ఉంది. నీళ్లులేకుండా పండించే పంటలు ఏవైనా ఉంటే రైతులకు చెప్పాలి.
– సాకే శైలజనాథ్, రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కమిటీ అధ్యక్షులు, మాజీ మంత్రి


