కర్నూలు(అగ్రికల్చర్): రానున్న ఐదు రోజుల్లో ఉమ్మడి జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు గుంటూరులోని గ్రామీణ వ్యవసాయ వాతావరణ సేవా పథకం బులెటిన్ విడుదల చేసింది. నైరుతి దిశగా గాలులు 7 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు కర్నూలు జిల్లాలో 35.5 డిగ్రీల నుంచి 36.3 డిగ్రీలు, నంద్యాల జిల్లాలో 36.5 డిగ్రీల నుంచి 38.2 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. గాలిలో తేమ ఉదయం పూట 70 శాతం వరకు, మధ్యాహ్నం సమయంలో 35–60 శాతం వరకు నమోదు కావచ్చని వాతావరణ అధికారులు తెలిపారు.


