ఆత్మకూరు: పట్టణంలోని పలు ఫర్టిలైజర్ దుకా ణాల యజమానులు ఇష్టారాజ్యంగా ఎరువుల అమ్మకాలు సాగిస్తున్నారు. రెండు రోజులుగా నియోజకవర్గంలో పలు మండలాల్లో వర్షాలు కురుస్తుండటంతో రైతులు మొక్కజొన్న, సోయాబీన్, వేరుశనగ, పత్తి పంటలు సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలో ఎరువుల కొనుగోలుకు ఆత్మకూరుకు పెద్ద సంఖ్య లో మంగళవారం రైతులు చేరుకున్నారు. అయితే రైతుల ఆసరాను సొమ్ము చేసుచేసుకునేందుకు ఎరువుల వ్యాపారులు ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయించారు. యూరి యాపై రూ.150, డీఏపీపై రూ.100 అదనంగా వసూలు చేశారు. రైతులకు మాత్రం ఎమ్మార్పీ కే విక్రయించినట్లు రశీదులు ఇచ్చారు. ఫోన్‌పే, ఇతర క్యాష్ రూపంలో అధికంగా వసూలు చేశారు. అయితే వెంటనే రైతులు వ్యవసాయ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో దుకాణ యజమానులు అధికంగా తీసు కున్న సొమ్మును తిరిగి ఇచ్చేశారు.


