ఎకరాకు రూ. 32 వేలకు పైగా ఖర్చు | - | Sakshi
Sakshi News home page

ఎకరాకు రూ. 32 వేలకు పైగా ఖర్చు

Apr 20 2026 9:47 AM | Updated on Apr 20 2026 9:47 AM

ఎకరాకు రూ. 32 వేలకు పైగా ఖర్చు మద్దతు ధర కల్పించాలి

ఈ ఏడాది రబీ సీజన్‌లో నాలుగు ఎకరాల సొంత పొలంలో వరిసాగు చేశాను. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపునివారణ, కోత, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 32 వేలకు పైగా ఖర్చు వచ్చింది. పైరు చేతికందటంతో ఇటీవలే నూర్పిడి పనులు చేపట్టాను. వాతావరణం అనుకూలించకపోవడంతో ఎకరాకు 25 బస్తాలకు మించి దిగుబడులు రాలేదు.

– చాకలి సుబ్బారావు, రైతు,

కంపమల్ల, కోవెలకుంట్ల మండలం

రెండేళ్ల నుంచి వరికి మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో వరి సాగుతో నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. రబీలో మూడు ఎకరా సొంత పొలంలో వరి సాగు చేశాను. ప్రస్తుత మార్కెట్‌లో బస్తా రూ.1,500 లోపే ఉంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటా రూ. 2,200 ప్రకారం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి.

– రఘునాథరెడ్డి, రైతు,

గుళ్లదూర్తి, కోవెలకుంట్ల మండలం

Advertisement
 
Advertisement
Advertisement