డీఎస్‌జీఎస్‌డబ్ల్యూఓగా భాస్కర్‌నాయుడు | - | Sakshi
Sakshi News home page

డీఎస్‌జీఎస్‌డబ్ల్యూఓగా భాస్కర్‌నాయుడు

Apr 20 2026 9:47 AM | Updated on Apr 20 2026 9:47 AM

నంద్యాల అధికారిగా కే లలితాబాయి

కర్నూలు(అర్బన్‌): జిల్లా స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు అధికారిగా (డీఎస్‌జీఎస్‌డబ్ల్యూఓగా) టీవీ భాస్కర్‌నాయుడు నియమితులయ్యారు. నంద్యాల జిల్లా డ్వామాలో ఎంఅండ్‌ఈగా విధులు నిర్వహిస్తున్న ఈయనను కర్నూలు డీఎస్‌జీఎస్‌డబ్ల్యూఓగా నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి భాస్కర్‌ కాటంనేని ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్‌జీఎస్‌డబ్ల్యూఓగా నియమితులైన భాస్కర్‌నాయుడు గతంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎంపీడీఓగా, జిల్లా పరిషత్‌ ఏఓ, డిప్యూటీ సీఈఓగా విధులు నిర్వహించారు. ఇటీవల జరిగిన పదోన్నతుల్లో భాగంగా ఆయనను ప్రభుత్వం ఇక్కడకు నియమించింది. అలాగే నంద్యాలలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న కే లలితాబాయిని నంద్యాల డీఎస్‌జీఎస్‌డబ్ల్యూఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 మంది డిప్యూటీ సీఈఓ, డీడీఓలకు పదోన్నతులు కల్పిస్తూ వేర్వేరు జిల్లాలకు స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు జిల్లా అధికారులుగా నియమించారు.

Advertisement
 
Advertisement
Advertisement