మార్చి 14న జాతీయ లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

మార్చి 14న జాతీయ లోక్‌ అదాలత్‌

Feb 4 2026 7:34 AM | Updated on Feb 4 2026 7:34 AM

మార్చి 14న  జాతీయ లోక్‌ అదాలత్‌

మార్చి 14న జాతీయ లోక్‌ అదాలత్‌

కర్నూలు: ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో మార్చి 14న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కోర్టుల్లోని సివిల్‌, మోటార్‌ వెహికల్‌ ప్రమాదాలు, వివాహ సంబంధమైన కేసులు, భూసేకరణ కేసులు, రాజీ కాదగిన క్రిమినల్‌, మున్సిపల్‌ ట్యాక్స్‌ కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి ఆదేశాల మేరకు కర్నూలు, నంద్యాల జిల్లాలో ఉన్న అన్ని కోర్టులలో ఫ్రీ లోక్‌ అదాలత్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయని, ఈ అవకాశాన్ని ఉపయో గించుకుని కక్షిదారులు తమ కేసులను రాజీ పూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించా రు. ముఖ్యంగా పది సంవత్సరాల పైబడి పెండింగ్‌లో ఉన్న సివిల్‌ కేసుల పరిష్కారానికి ఈ ఫ్రీ సిట్టింగ్‌ లోక్‌ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

కల్లూరు, మద్దికెరలో

అతి పెద్ద గోదాములు

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలోని కల్లూరు, మద్దికెర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు అతి పెద్ద గోదాములు నిర్మించుకునేందుకు సహకార శాఖ చర్యలు చేపట్టింది. వరల్డ్‌ లార్జెస్ట్‌ గ్రెయిన్‌ స్టోరేజీ ప్రాజెక్టు (డబ్ల్యూఎల్‌జీఎస్‌పీ) కింద ఒక్కో సంఘం పరిధిలో 2,500 టన్నుల సా మర్థ్యం కలిగిన గోదాములు నిర్మించడానికి జిల్లా సహకార కేంద్రబ్యాంకులోని ఫ్యాక్స్‌ డెవలప్‌మెంటు సెల్‌ డీపీఆర్‌ సిద్ధం చేస్తోంది. ఈ గోదాములు నిర్మించాలంటే కనీసం 2 ఎకరాల భూమి అవసరం. మద్దికెర, కల్లూరు సహకార సంఘాలకు ఈ స్థాయిలో భూములు ఉండటంతో డబ్ల్యూఎల్‌జీఎస్‌పీ కింద గోదాముల నిర్మాణానికి సహకార శాఖ చర్యలు చేపట్టింది. డబ్ల్యూఎల్‌జీఎస్‌పీ 33 శాతం సబ్సిడీ ఇస్తుంది. కలెక్టర్‌ నుంచి పరిపాలన అనుమతులు తీసుకున్న తర్వాత పనులు మొద లు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement