
‘కస్తుర్బా’ విద్యార్థినులకు అస్వస్థత
బేతంచెర్ల: పట్టణానికి సమీపంలోని కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇద్దరు విద్యార్థినులు శనివారం అస్వస్థకు గురయ్యారు. బేతంచెర్లలోని జెండాపేటకు చెందిన 9వ తరగతి విద్యార్థిని విజయలక్ష్మికి చేతులు కాళ్లు పట్టేసి ఆయాసం వచ్చింది. అలాగే 7వ తరగతి విద్యార్థిని నాగ భవానికి ఫిట్స్ వచ్చాయి. వీరికి స్థానిక పీహెచ్‌సీలో ప్రాథమిక వైద్యం చేశారు. విషయం తెలిసి సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భార్గవ్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యాక్షుడు ఉదయ్ ఆసుపత్రికి వచ్చి విద్యార్థినులను పరామర్శించారు. ఇదే విద్యాలయంలో గత నెలలో 9వ తరగతి విద్యార్థిని లలిత మాధురి మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. అస్వస్థతకు గురైన ఇద్దరు విద్యార్థులను 108 వాహనంలో కర్నూలుకు తరలించారు.