
పట్ట పగలే చోరీ
పాణ్యం: మండల కేంద్రమైన పాణ్యం విజయానికేతన్ పాఠశాల సమీపంలో ఓ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. గ్రామానికి చెందిన జక్కుల మద్దిలేటి డొంగు వద్ద ఉన్న హోటల్ వంట మాస్టర్‌గా పని చేస్తున్నారు. రోజులాగే తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు భార్యాభర్తలు హోటల్‌కు వెళ్లారు. ఆ సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించి మూడు బీరువాలను పగులగొట్టి రూ. 60 వేలు నగదు, ఒక ఉంగరాన్ని అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు క్లూస్‌టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. దొంగలు చోరీకి ఉపయోగించిన సుత్తి, ఇనుపరాడ్డును అక్కడే వదిలేయడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.