
శ్రీమఠంలో నంద్యాల జిల్లా కలెక్టర్
మంత్రాలయం రూరల్: శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనార్థం బుధవారం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి మంత్రాలయానికి వచ్చారు. జిల్లా కలెక్టర్‌కు శ్రీమఠం అధికారులు స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు అర్చన సహిత హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రాఘవేంద్రుల మూలబృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు జిల్లా కలెక్టర్‌కు ఫలపూలమంత్రాక్షింతలతో ఆశీర్వచనం చేశారు.
అంచనా విలువ కన్నా 40 శాతం లెస్‌కు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పూర్తి స్థాయిలో ఆయా స్కీంలను నిర్వహిస్తారనేది ప్రశ్నార్థకమేనని ఆ శాఖకు చెందిన ఇంజినీర్లే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. లెస్‌కు అగ్రిమెంట్ చేసుకున్న నీటి పథకాలకు సంబంధించి దాదాపు 120కి పైగా గ్రామాల ప్రజలకు రక్షిత మంచి నీటిని అందించాల్సి ఉంది. అయితే అయితే అక్కడి ప్రజల అవసరాలకు అనుగుణంగా నీటిని విడుదల చేసి చేతులు దులుపుకుంటారేమో అనే అనుమానాలను కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఏ గ్రామానికి ఎంత నీరు సరఫరా చేశారో, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్లు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఎం బుక్ రికార్డ్ చేసి బిల్లులను చేయాల్సి ఉంది. ఇందులో పారదర్శకత లోపిస్తే లెస్ టెండర్లకు ఫలితం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
చివరి గ్రామాలకు
రక్షిత నీరు
ప్రశ్నార్థకమే!