
దొంగ అరెస్టు
బనగానపల్లె: ఇంటి పక్కనే ఉండి చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు..మండలంలోని ఇల్లూరుకొత్తపేట గ్రామంలో నూర్ ఆహమ్మద్, జాఫర్‌హుస్సేన్‌ల గృహాలు పక్కపక్కనే ఉన్నాయి. అయితే, వీరి మధ్య మనస్పర్థలు ఉండటంతో మాటల్లేవు. ఈ క్రమంలో ఈనెల 26వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి జాఫర్‌హుస్సేన్ తమ బందువుల ఊరికి వెళ్లాడు. గమనించిన నూర్‌ఆహమ్మద్ రాత్రి ఇంటి తాళం పగలగొట్టి లోపలికి చొరబడి బీరువాలో ఉన్న రూ. 4.80 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండివస్తువులు చోరీ చేశాడు. మరుసటి రోజు ఇంటికి చేరుకున్న జాఫర్‌హుస్సేన్ ఇంటి తాళం, బీరువా తెరిచి ఉండటంతో చోరీ జరిగిందని నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చోరీకి గురైన సొమ్ములో గోల్డ్ రింగ్ మినహా మిగతా ఆభరణాలన్నీ రికవరీ చేసినట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.