అబ్దుల్ హమీద్‌కు ఉత్తర్వులు అందజేస్తున్న దృశ్యం
కర్నూలు(అగ్రికల్చర్): ఆల్ ఇండియా గవర్నమెంట్ డ్రైవర్స్ ఫెడరేషన్ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన సర్దార్ అబ్దుల్ హమీద్ ఎన్నికయ్యారు. ఈనెల 25, 26 తేదీల్లో ఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా గవర్నమెంట్ డ్రైవర్స్ ఫెడరేషన్ ఎన్నికల కార్యక్రమానికి అబ్దుల్ హమీద్ హాజరయ్యారు. సోమవారం వివిధ ప్రాంతాల ఫెడరేషన్ అధ్యక్షులను నియమిస్తూ సెక్రెటరీ సత్పాల్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్ విభాగంలో పనిచేస్తున్న అబ్దుల్ హమీద్‌ను దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడిగా నియమించారు. రెండోసారి దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడిగా నియమితులైన అబ్దుల్ హమీద్‌ను పలువురు అభినందించారు.


