16, 17 తేదీల్లో ‘సర్‌’పై ప్రత్యేక క్యాంపులు | - | Sakshi
Sakshi News home page

16, 17 తేదీల్లో ‘సర్‌’పై ప్రత్యేక క్యాంపులు

Oct 15 2026 11:29 AM | Updated on Oct 15 2026 11:29 AM

నల్లగొండ: ఓటరు జాబితా సమగ్ర సర్వే (ఎస్‌ఐఆర్‌)పై ఈ నెల 16, 17 తేదీల్లో ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ప్రత్యేక ప్రచార క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌ నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లతో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ, తాగునీటి సరఫరా, భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి మాట్లాడారు. ప్రత్యేక ప్రచార కార్యక్రమాలలో తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొనాలని, అవసరమైన పత్రాలు, నోటీసులు, రిజిస్టర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

గ్రాడ్యుయేట్‌ ఓటర్ల నమోదు పెంచాలి

అనంతరం గ్రాడ్యుయేట్‌ ఎన్నికల పరిధిలోని జిల్లాల డీఆర్వోలు, ఆర్డీఓలు, తహసీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడారు. ఫామ్‌–18 ద్వారా గ్రాడ్యుయేట్‌ ఓటర్ల నమోదును పెంచాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. ఓటరు నమోదుపై ఉపాధ్యాయులు, డిగ్రీ కళాశాలల విద్యార్థులు, అర్హులైన గ్రాడ్యుయేట్లలో అవగాహన కల్పించాలన్నారు. ఆయా అంశాలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ, మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచాలి

అనంతరం విద్యాశాఖ కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల స్థాయిలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యం పెంపొందించాలన్నారు. జిల్లాలో తక్కువ పురోగతి ఉన్న 100 పాఠశాలలను గుర్తించి నెల రోజుల్లో ఆ పాఠశాలల్లో కనీసం 70 శాతం లక్ష్యాలు సాధించేలా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో శిక్షణ సహాయ కలెక్టర్‌ ఎన్‌.శ్రీకాంత్‌రెడ్డి, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ ప్రేమ్‌ కరణ్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు, ఎంఈఓ లు, ఆర్‌సీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement