హెచ్‌ఐవీ నియంత్రణపై దృష్టిసారించాలి | - | Sakshi
Sakshi News home page

హెచ్‌ఐవీ నియంత్రణపై దృష్టిసారించాలి

Oct 15 2026 11:29 AM | Updated on Oct 15 2026 11:29 AM

నల్లగొండ: హెచ్‌ఐవీ నియంత్రణపై దృష్టిసారించాలని జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌, కేంద్ర, కుటుంబ, ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్‌ రాకేష్‌గుప్త అన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఎయిడ్స్‌ సంక్రమణ ఎక్కువగా ఉన్న జిల్లాల కలెక్టర్లతో బుధవారం ఆయన న్యూఢిల్లీ నుంచి హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నియంత్రణకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. హెచ్‌ఐవీ వ్యాప్తిని తగ్గించడంతో పాటు, వైరస్‌ సోకిన వారిని గుర్తించి, సకాలంలో వైద్య సేవలు అందించాలని, మిషన్‌ ఎయిడ్స్‌ సురక్ష కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్లకు సూచించారు. ఈ వీడియో కాన్పరెన్స్‌కు నల్లగొండ కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రాహుల్‌ హాజరయ్యారు.

నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం

కేతేపల్లి: ఎల్‌నినో నేపథ్యంలో వీబీజీ రాంజీ పథకం కింద చేపట్టే పనుల్లో నీటి సంరక్షణ పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డీఆర్‌డీఓ వై.శేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌, బండపాలెం గ్రామాల్లో వీబీజీ రాంజీ పథకం కింద కూలీలు చేస్తున్న పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. భూగర్భ జలాలు అడుగంటిన ప్రస్తుత తరుణంలో నీటిని సంరక్షించక పోతే మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుందన్నారు. వీబీజీ రాంజీ పథకం కింద చేపడుతున్న పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయన వెంట సర్పంచులు కె.సైదిరెడ్డి, పి.శ్రీనివాసరావు, నకిరేకల్‌ క్లస్టర్‌ ఏపీడీ బి.లక్ష్మీనర్సింహారావు, కేతేపల్లి ఎంపీడీఓ ఎంఏ సలీమ్‌, ఎంపీఓ నాగలక్ష్మి, ఏపీఓ రమణయ్య, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.

శాసీ్త్రయ పద్ధతులతో అధిక దిగుబడులు

మునుగోడు (మర్రిగూడ): వ్యవసాయ రంగంలో రైతులు శాసీ్త్రయ పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు పిలుపునిచ్చారు. బుధవారం మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో కపాస్‌ క్రాంతి మిషన్‌ ఫర్‌ కాటన్‌ ప్రొడక్టివిటీ కార్యక్రమంలో భాగంగా పత్తి సాగులో దగ్గరగా విత్తే పద్ధతిపై రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో శాస్త్రవేత్తలు అనిల్‌, శ్రీధర్‌, నళిని, హిమబిందు, విద్యాసాగర్‌లు పాల్గొని మాట్లాడారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ ఐతగోని పద్మ వెంకటయ్య, లెంకలపల్లి క్లస్టర్‌ వ్యవసాయ విస్తరణాధికారి అరుణ, ఉప సర్పంచ్‌ మేతరి శంకర్‌, వార్డు సభ్యులు శ్రీను, గణేశ్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement