పన్ను కట్టకుంటే రెడ్‌ నోటీసే | - | Sakshi
Sakshi News home page

పన్ను కట్టకుంటే రెడ్‌ నోటీసే

Oct 15 2026 11:29 AM | Updated on Oct 15 2026 11:29 AM

ఆస్తి పన్ను చెల్లించాలి

నల్లగొండ టూటౌన్‌ : నీలగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఆస్తి పన్ను బకాయిలకు చెక్‌ పెట్టేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. ప్రస్తుత సంవత్సరం ఆస్తి పన్ను చెల్లించని వారిని మినహాయించి ఆస్తి పన్ను బకాయి ఉన్న వారందరికి రెడ్‌ నోటీసులు పంచుతున్నారు. 48 డివిజన్‌ పరిధిలో మొత్తం 44 వేల ఇంటి నంబర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 14 వేల మంది వరకు ఆస్తి పన్ను రెగ్యులర్‌గా కట్టిన వారిలో ఉన్నారు. వీరిలో 24 వేల మందికి చెందిన ఇంటి నంబర్ల భవనాలకు సంబంధించి ఆస్తి పన్ను చెల్లించకుండా బకాయిలు పడ్డారు. వీరందరికి నోటీసులు ఇస్తున్నారు. రూ.20 కోట్లకు పైగా ఆస్తి పన్ను బకాయి రావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రతి బకాయిదారునికి నోటీస్‌

నగరంలోని 48 డివిజన్ల పరిధిలో బకాయిదారులకు సంబంధించిన ఆస్తి పన్ను వివరాలతో కూడిన రెడ్‌ నోటీసును తయారు చేయించారు. ఆస్తి పన్ను బకాయి ఉన్న ప్రతి ఒక్క భవన యాజమానికి తప్పనిసరిగా రెడ్‌ అందించాలని నిర్ణయించారు. డివిజన్‌లో ఎన్ని ఇంటి నంబర్లు ఉన్నాయి.. ఆస్తి పన్ను బకాయి ఉన్న వారు ఎందరు.. రెండేళ్లుగా పన్ను కట్టని వారికి ప్రత్యేకంగా ఆస్తి పన్ను రెడ్‌ నోటీస్‌ కచ్చితంగా ఇవ్వాలని కార్పొరేషన్‌ కమిషనర్‌ వంశీకృష్ణ వార్డు ఆఫీసర్లకు దిశ నిర్దేశం చేశారు. గతంలో కొంత మందికి నోటీస్‌లు ఇచ్చి మిగతా వారికి ఇవ్వకుండా వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి బకాయిదారుడికి పన్ను ఎంత ఉందనే విషయం తెలియాలి.. పన్ను వసూలు చేయాలి.. అనే విధానంతో ముందుకు పోతున్నారు. నోటీస్‌ ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వలేదు.. ఇంటి నంబర్‌ ఆ డివిజన్‌ పరిధిలో లేదా.. లేక ఆ భవనాన్ని కూల్చివేశారా అనే వివరాలు కూడా సేకరిస్తున్నారు.

పక్కాగా కార్యాచరణ

మున్సిపల్‌ కార్పొరేషన్‌ యంత్రాంగం గతంలో సాదాసీదాగా రెడ్‌ నోటీసులు, సాధారణ నోటీసులు అందించే వారు. కానీ ఇప్పుడు.. పక్కా వివరాలతో కమిషనర్‌.. ప్రొఫార్మా రూపొందించి రెడ్‌ నోటీసులు తయారు చేయించారు. ఇంటి నంబరు, యాజమాని పేరు, ఆస్తి పన్ను బకాయి ఎంత ఉంది, ఎప్పటి నుంచి బకాయి ఉంది అనే వివరాలను పొందుపరిచారు. ప్రస్తుతం ఇస్తున్న రెడ్‌ నోటీస్‌లో వార్డు ఆఫీసర్లు పెన్ను పట్టి రాసే విధానానికి చెక్‌ పెట్టారు. తద్వారా డివిజన్‌ పరిధిలోని బకాయిదారులందరికి నోటీసులు అందనున్నాయి.

ఫ నీలగిరిలో రూ.20 కోట్లకుపైగా ఆస్తి పన్ను బకాయిలు

ఫ పన్ను వసూలుకు ప్రత్యేక ప్రణాళిక

ఫ 24 వేల మందికి నోటీసులు

ఆస్తి పన్ను బకాయిలు పడిన వారందరికి రెడ్‌ నోటీసులు పంపిణీ చేస్తాం. ఈ వారం రోజుల్లో నోటీసుల ప్రక్రియ పూర్తవుతుంది. ఆస్తి పన్ను బకాయి పడిన వారందరు పన్ను చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలి.

– బి.వంశీకృష్ణ, మున్సిపల్‌

కార్పొరేషన్‌ కమిషనర్‌, నల్లగొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement