మైనింగ్‌ పనులు నిలిపివేయాలి | - | Sakshi
Sakshi News home page

మైనింగ్‌ పనులు నిలిపివేయాలి

Oct 15 2026 11:29 AM | Updated on Oct 15 2026 11:29 AM

దేవరకొండ : దేవరకొండ మండలంలోని కాచారం గ్రామంలో మైనింగ్‌ పనులను నిలిపివేయాలనే డిమాండ్‌తో గ్రామస్తులు చేపట్టిన ఆందోళన బుధవారం మూడో రోజుకు చేరుకుంది. గ్రామస్తులు వంటావార్పు నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ ముదిగొండ శ్యామలయ్య మాట్లాడుతూ.. గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నప్పటికీ మైనింగ్‌కు అనుమతులు ఎలా ఇచ్చారని అధికారులను ప్రశ్నించారు. బ్లాస్టింగ్‌, డ్రిల్లింగ్‌ చేస్తున్న సమయంలో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టి మైనింగ్‌ను నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ పోతురాజు మల్లేష్‌, సైదులు, సాలయ్య, జంగయ్య, బాలకృష్ణ, శ్రీనయ్య, లింగమయ్య, రాములు, అచ్చయ్య, పెద్దమ్మ, వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement