చెంతకు వచ్చి.. భరోసా ఇచ్చి! | - | Sakshi
Sakshi News home page

చెంతకు వచ్చి.. భరోసా ఇచ్చి!

Jun 23 2026 1:58 AM | Updated on Jun 23 2026 1:58 AM

నల్లగొండ : మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన బాణావత్‌ పార్వతి వితంతు, దివ్యాంగ మహిళ తనకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు మంజూరు చేయాలని కోరేందుకు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చింది. వీల్‌చైర్‌లో ఉన్న ఆమె వద్దకు కలెక్టర్‌ స్వయంగా వచ్చారు. ఆమె సమస్యను విన్నారు. తనకు భర్త లేడని, ఎలాంటి ఉపాధి లేదని, ఇంటి అద్దె చెల్లించే స్థితిలో లేనని కలెక్టర్‌కు వివరించింది. దీంతో కలెక్టర్‌ చంద్రశేఖర్‌ స్పందించి డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో ఆమెకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్డీఓను ఆదేశించారు. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్తూ కలెక్టరేట్‌ మెట్లు దిగేందుకు తీవ్ర ఇబ్బంది పడిండుతూ కనిపించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement