కలెక్టరేట్‌ ఎదుట కిసాన్‌ మోర్చా ధర్నా | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ఎదుట కిసాన్‌ మోర్చా ధర్నా

Jun 23 2026 1:58 AM | Updated on Jun 23 2026 1:58 AM

నల్లగొండ టూటౌన్‌ : రైతుల సమస్యలు పరిష్కరించాలని, రైతు భరోసా డబ్బులు వెంటనే ఖాతాల్లో జమ చేయాలని కోరుతూ బీజేపీ కిసాన్‌ మోర్చా సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా కిసాన్‌మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూధన్‌రెడ్డి మాట్లాడుతూ రైతు బీమా పథకం అమలు చేయాలని, నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకట్‌రెడ్డి, గుండా నవీన్‌రెడ్డి, లింగస్వామి, కరుణాకర్‌రెడ్డి, సత్యనారాయణ, సామ వెంకట్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, భిక్షంరెడ్డి, బీపంగి జగ్జీవన్‌, మధుకర్‌, పాపిరెడ్డి, వెంకట్‌రెడ్డి, ఓంప్రకాష్‌ ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement