నల్లగొండ : నీట్–2026 రీ ఎగ్జామినేషన్ నల్లగొండలో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మొత్తం 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2,065 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 1,782 మంది హాజరయ్యారు. 283 మంది గైర్హాజరయ్యారు. కలెక్టర్ బి. చంద్రశేఖర్ కేంద్రియ విద్యాలయంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని, ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఎన్జీ కాలేజి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలు, హాజరు–గైర్హాజరు, పోలీసు బందోబస్తు, భద్రతా తనిఖీలు తదితర అంశాలను పరిశీలించి కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ నుంచి వివరాలు తెలుసుకున్నారు.


