నల్లగొండ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. శనివారం నల్లగొండలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్, ఒకేషనల్ కళాశాలలను మంత్రి సందర్శించి మీడియాతో మాట్లాడారు. కోమటిరెడ్డి ప్రతీక్ పాఠశాలలో విద్యార్థులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విద్యను అందించేలా నెలరోజుల్లో ప్రత్యేక ల్యాబ్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం ప్రభుత్వ జూనియర్, ఒకేషనల్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశమయ్యారు. కార్యక్రమాల్లో స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రాజేందర్, ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఏ.ఉపేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పైలాన్ పనులు పరిశీలించిన మంత్రి
కనగల్ : కనగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి హ్యామ్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సందర్భంగా, శనివారం మంత్రి కోమటిరెడ్డి హ్యామ్ రోడ్ల శంకుస్థాపన పైలాన్ పనులను పరిశీలించారు. రాష్ట్రంలో రూ.13,500 కోట్లతో చేపట్టే హ్యామ్ రోడ్ల నిర్మాణానికి గుర్తుగా నల్లగొండ నియోజకవర్గంలో పైలాన్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీధర్‌రెడ్డి, డీఈ గణేష్, ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్‌రెడ్డి, జేఈ దినేష్‌రెడ్డి, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్, తహసీల్దార్ పద్మ, ఎంపీడీఓ వేదరక్షిత, ఎల్లమ్మ ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్‌రెడ్డి, సర్పంచ్ నర్సింగ్ మురళీగౌడ్ పాల్గొన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


