మునుగోడు : రైతులను నిండా ముంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆరోపించారు. శనివారం మునుగోడులో నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ బీఎల్‌ఏల ప్రత్యేక ఓటరు సవరణ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా ఇప్పటికే మూడు మార్లు ఎగ్గొట్టడమే కాకుండా రైతులు పండించిన ధాన్యాన్ని అంతా కొనలేమని బాహాటంగా ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4 లక్షల కోట్లు అప్పుచేసి నామమాత్రపు సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎలాంటి సమచారం లేకుండా అర్హులైన ఓట్లను తొలగించి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. సర్ కార్యక్రమంపై పార్టీ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నల్లగొండ, సూర్యాపేట జిల్లాల ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీకి తొత్తుగా మారి వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. బాలికను అత్యాచారం చేసిన బండి భగీరథను మూడు నెలల పాటు జైల్‌లో ఉంచాల్సి బోయి నెల రోజులు కాకముందే బెయిల్ ఇప్పించారని ఆరోంపించారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ ఇన్‌చార్జి క్యామ మల్లేష్, కల్గుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతిరెడ్డి, మునగాల నారాయణరావు, కర్నాటి వెంకటేష్, పల్లె కళ్యాణి, పెద్టింటి బుచ్చిరెడ్డి, మందుల సత్యం, నల్లగొండ అంజి, పగిళ్ల సతీష్, మాదరబోయిన పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి


