పెద్దఅడిశర్లపల్లి : జల సంరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి (డీఆర్‌డీఓ) శేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పెద్దఅడిశర్లపల్లి మండలం దుగ్యాల మోడల్ స్కూల్‌లో జల సంచయ్–జన్ భాగీదారీ ప్రచార కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు జల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి సంరక్షణ కోసం కొండవాలు ప్రాంతాల్లో కందకాలు, చెక్‌డ్యామ్‌లు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అనంతరం పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ క్లస్టర్ ఏపీడీ బాలకృష్ణ, ఎంపీడీఓ చంద్రమౌళి, సర్పంచ్ నగేష్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఏపీఓ రాజు, ఏపీఎం నాగలీల, టీఏలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మొక్కలను దత్తత తీసుకోవాలి
చండూరు : గ్రామాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్కను నాటి, దానిని దత్తత తీసుకొని సంరక్షించాలని జిల్లా ఫారెస్ట్ అధికారి సుమన్, ఎంపీడీఓ బండారు యాదగిరి పిలుపునిచ్చారు. వన మహోత్సవంలో భాగంగా శనివారం చండూరు పట్టణ పరిధిలోని బంగారిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్పంచ్ బోయపల్లి సునీత, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి వారు మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ కోటయ్య, ఏపీఓ శ్రీనివాస్, హెచ్‌ఎం వేలంగిని మేరి, వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


