నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో ఆదివారం ఉదయం 6 గంటలకు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించనున్నట్టు జిల్లా యువజన క్రీడల అధికారి అక్బర్ అలీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ చంద్రశేఖర్, ఇతర జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొననున్న ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు కూడా హాజరై జయప్రదం చేయాలని కోరారు.
డిసెంబర్ నాటికి ప్రాజెక్టుల పనులు పూర్తి
ఫ నీటి పారుదల శాఖ కమిషనర్ శివకుమార్ నాయుడు
నల్లగొండ : జిల్లాలో కొనసాగుతున్న నీటి ప్రాజెక్టుల పనులను డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని ఆర్‌అండ్‌ఆర్ భూసేకరణ, నీటిపారుదల శాఖ కమిషనర్ కె.శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధ్యక్షతన వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు. ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్, డిండి ప్రాజెక్టు, చింతపల్లి రిజర్వాయర్, సింగరాజుపల్లి, కష్ణంపల్లి, అంబాభవాని, కంబాలపల్లి, ఐటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ తదితర ప్రాజెక్టుల పనుల స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో అవార్డులు మంజూరైనందున పనుల విషయంలో జాప్యం చేయొద్దన్నారు. ఆర్‌అండ్‌ఆర్ కాలనీల కోసం భూసేకరణ పూర్తయిన చోట లేఅవుట్లు రూపొందించి, మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగంగా చేపట్టాలని ఆదేశించారు. ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించి, అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేసినందుకు కలెక్టర్‌ను కమిషనర్ అభినందించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ్, సీఈ గగనం శ్రీనివాస్‌రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) నెలటూరి శ్రీకాంత్‌రెడ్డి, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ మాధురి, జిల్లా అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.


