రోడ్డు ప్రమాదాలను నివారించాలి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాలను నివారించాలి

Jun 20 2026 11:37 AM | Updated on Jun 20 2026 11:37 AM

నల్లగొండ : రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రహదారులపైకి విస్తరించిన చెట్ల కొమ్మలు, ముళ్లపొదలను తొలగించాలని సూచించారు. గ్రామాలకు అనుసంధానంగా ఉన్న రహదారులు కోతకు గురికాకుండా చూడాలని, కనగల్‌–దేవరకొండ రహదారిపై గుంతలను తక్షణమే పూడ్చాలని ఆదేశించారు. ఇసుక లారీలు, ట్రాక్టర్లు సహా అన్ని వాహనాలకు రిఫ్లెక్టర్లు, గుర్తింపు బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. రాంగ్‌రూట్‌లో రహదారులు దాటకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాలకు ఆస్కారం ఉన్న బ్లాక్‌ స్పాట్లను గుర్తించి నివారణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. చిట్యాల ప్రాంతంలోని పరిశ్రమల వద్ద కార్మికుల రాకపోకల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వై.అశోక్‌రెడ్డి, డీఆర్‌ఓ దశరథ్‌, అడిషనల్‌ ఎస్పీ రమేష్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

22 నుంచి మాదకద్రవ్య వ్యతిరేక వారోత్సవాలు

మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 22 నుంచి 26 వరకు మాదకద్రవ్య వ్యతిరేక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. వారోత్సవాల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు పోటీలు, గ్రామస్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్‌ 26న 2కే రన్‌ నిర్వహిస్తామన్నారు. అనంతరం మాదకద్రవ్య వ్యతిరేక వారోత్సవాల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఫ కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement