వేములపల్లి : పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని ఎస్పీ శరత్‌చంద్రపవార్ అన్నారు. శుక్రవారం వేములపల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా సందర్శించి స్టేషన్‌లో పెండింగ్ కేసులను అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించి మాట్లాడారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లోని ప్రధాన వీధులు, వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇసుక, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, పేకాట, గుట్కా, మాదకద్రవ్యాల నివారణకు కృషి చేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతతో స్వీకరించి చట్టపరమైన చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌బీ సీఐ ఆదిరెడ్డి, రూరల్ సీఐ పీఎన్‌డీ ప్రసాద్, ఎస్‌ఐ డి.వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్రపవార్


