ఎన్జీ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

ఎన్జీ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల

Jun 19 2026 2:06 AM | Updated on Jun 19 2026 2:06 AM

రామగిరి(నల్గొండ): నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ సముద్రాల ఉపేందర్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఉపేందర్‌ రెడ్డి, ఎన్జీ కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి మునిస్వామి ఈ ఫలితాలను విడుదల చేశారు. డిగ్రీ 2వ, 4వ, 6వ రెగ్యులర్‌ సెమిస్టర్లతో పాటు 1వ, 3వ, 5వ సెమిస్టర్ల బ్యాక్‌లాగ్‌ ఫలితాలను కూడా వెల్లడించారు. రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ విద్యార్థులు కలిపి మొత్తం 68శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ పరంగి రవికుమార్‌, అకడమిక్‌ కోఆర్డినేటర్లు బత్తిని నాగరాజు, శ్రీనివాసరెడ్డి, ఎగ్జామ్‌ బ్రాంచ్‌ మెంబర్‌ కోటయ్య, అసిస్టెంట్‌ కంట్రోలర్స్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ వాసుదేవ్‌, వేణు, బొజ్జ అనిల్‌ కుమార్‌, ఇతర అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement