ప్రీమెట్రిక్‌ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ప్రీమెట్రిక్‌ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

Jun 19 2026 2:06 AM | Updated on Jun 19 2026 2:06 AM

నల్లగొండ: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, ఎయిడెడ్‌, మున్సిపల్‌ ఉన్నత పాఠశాలల్లో 9వ, 10వ తరగతులు చదువుతున్న అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులకు 2026–27 విద్యా సంవత్సరానికిగాను ప్రీమెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సంజీవయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు సంవత్సరానికి రూ.4 వేల చొప్పున ప్రీమెట్రిక్‌ ఉపకార వేతనం మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఫ్రెష్‌, రెన్యూవల్‌ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు తెలంగాణ ఈ–పాస్‌ వెబ్‌సైట్‌ ద్వారా సమర్పించాల్సి ఉంటుందని తెలి పారు. స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఆధార్‌ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్‌ సైజు ఫొటో, బ్యాంకు పాస్‌ బుక్‌ కాపీ, స్టడీ సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంత విద్యార్థుల ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలని తెలిపారు.

మహిళా డిగ్రీ కళాశాలలో మిగిలిన సీట్లకు అడ్మిషన్లు

నల్లగొండ: 2026–27 విద్యా సంవత్సరానికిగాను నల్లగొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం వివిధ కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్లకు అడ్మిషన్లు కొనసాగుతున్నాయని కళాశాల ప్రిన్సిపాల్‌ పవిత్ర వాణి కర్ష గురువారం తెలిపారు. బీఎస్సీ ఫిజికల్‌ సైన్స్‌లో (మ్యాథమెటిక్స్‌ ఫిజిక్స్‌ కెమిస్ట్రీ), (మ్యాథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌, డేటా సైన్స్‌), (మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌), బీఎస్సీ లైఫ్‌ సైన్స్‌లో (బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ), (మైక్రోబయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ), బీకాం (బిజినెస్‌ అనలైటిక్స్‌), బీకాం (కంప్యూటర్‌ అప్లికేషన్స్‌), బీఏ (హిస్టరీ ఎకనామిక్స్‌ పొలిటికల్‌ సైన్స్‌) కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ, విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 21లోపు కళాశాలలో సంప్రదించాలని కోరారు.

గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మల్లేష్‌

కట్టంగూర్‌ : తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కట్టంగూర్‌ మండలంలోని కల్మెర గ్రామానికి చెందిన గుండాల మల్లేష్‌గౌడ్‌ నియామకమయ్యారు. బీసీడీఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు గట్టు రామచంద్రయ్య గురువారం నియామకపత్రం జారీ చేశారు. ఈమేరకు హైదరాబాద్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చేతులమీదుగా మల్లేష్‌గౌడ్‌ నియామకపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. తన నియామాకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement