ఆటో ఎక్కండి.. స్కూల్‌కు రండి..
నగరంలో ప్రతి రోడ్డులోనూ వాహనాలు వేగంగా వెళ్తున్నాయి. పలు ప్రమాదాలు జరిగి ద్విచక్ర వాహనాదారులు, పాదాచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పుడు సెయింట్ ఆల్ఫోన్సెస్ పాఠశాల వద్ద ఈ ఎస్కలేటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో రోడ్డు దాటే మార్గం సులభం కానుంది. అదే విధంగా రెడ్డి హాస్టల్ వద్ద, మేళ్ల దుప్పలపల్లి రోడ్డు క్రాసింగ్ వద్ద, గంధంవారిగూడెం క్రాసింగ్ వద్ద వాహాణాల వేగాన్ని నిరోధించేందుకు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉంది.
నల్లగొండ టూటౌన్ : నీలగిరి నగరంలోని డీవీకే రోడ్డు సెయింట్ ఆల్ఫోన్సెస్ హైస్కూల్ వద్ద నిర్మిస్తున్న ఎస్కలేటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ. 8 కోట్లు మంజూరు చేయించిన విషయం తెలిసిందే. అత్యధిక రద్దీ గల ఈ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ద్వారా రోడ్డు దాటే ప్రజలకు ఊరట కలగనుంది.
ఉదయం, సాయంత్రం రద్దీ..
డీవీకే రోడ్డులోని సెయింట్ ఆల్ఫోన్సెస్ పాఠశాల వద్ద రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీగా ఉంటుంది. ఆటోలు, ద్విచక్ర వాహనాల సంఖ్య కూడా భారీగా ఉంటుంది. ఈ సమయంలో పిల్లలు, పెద్దలు రోడ్డు దాటాలంటే హడలెత్తిపోవాల్సిందే. ఏ మాత్రం ఆదమరిచినా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్రం ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ ఎస్కలేటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయించారు. జాతీయ రహదారి నిర్మాణం సంస్థ ఈ బ్రిడ్జి నిర్మిస్తోంది.
తొలి ఎస్కలేటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి..
పెద్ద, పెద్ద నగరాల్లో మాత్రమే ఉండే ఈ ఎస్కలేటర్ బ్రిడ్జి తాజాగా నీలగిరి నగరంలో కూడా అందుబాటులోకి రానుంది. ఉమ్మడి జిల్లాలో తొలి ఎస్కలేటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిగా నిలిచిపోనుంది. అదే విధంగా ఖమ్మం, మహబూబ్‌నర్ లాంటి జిల్లాల్లో కూడా ఎస్కలేటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు లేవని అధికారులు చెబుతున్నారు.
తిప్పర్తి : మండలంలోని సిలార్‌మియాగూడెం గ్రామంలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వచ్చేందుకు ఉపాధ్యాయులు సొంత నిధులతో ఆటో సౌకర్యం కల్పించారు. ఆ ఆటోను సర్పంచ్ శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సదుపాయాలను కల్పిస్తోందని, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. అనంతరం ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు యర్రమాద కవిత నరేందర్‌రెడ్డి, చింతకుంట్ల రవీందర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు ఆదిమల్ల శ్రీనివాస్, మధుబాబు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
నీలగిరిలో శరవేగంగా ఎస్కలేటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం
ఫ సెయింట్ ఆల్ఫోన్సెస్ పాఠశాల వద్ద రూ.8 కోట్లతో పనులు


