నల్లగొండ : నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయం (ఇందిరా భవన్)లో బుధవారం వివిధ సమస్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ప్రజలు వినతిపత్రాలు సమర్పించారు. ప్రజల సమస్యలను విన్న మంత్రి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి పలువురికి ఆర్థిక సాయం అందజేశారు.
మంత్రిని కలిసిన ట్రైనీ ఐఏఎస్
ట్రైనీ ఐఏఎస్ అధికారి శ్రీకాంత్‌రెడ్డి బుధవారం నల్లగొండలోని ఇందిరాభవన్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రికి మొక్క అందజేశారు.


